హ్యాకింగ్ భారీ నుండి మెయిల్‌ను కాపాడుకోండిలా..

ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచారం చాలాభద్రంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి అందరిదీ..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదముంది. గత వారమై వన్ బిలియన్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయంటూ యాహూ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని టిప్స్ ఇస్తున్నాం ఓ సారి చూడండి
స్ట్రాంగ్ పాస్ వర్డ్ హ్యాకర్లు మీ అకౌంట్ ని హ్యాక్ చేయకుండా ఉండాలంటే వీలైనంత స్ట్రాంగ్ పాస్ వర్డ్ ఇవ్వడం మంచింది. స్పెషల్ క్యారక్టర్స్ ఇవ్వడం మరచిపోవద్దు. అవే మీ అకౌంట్ ని సురక్షితంగా ఉంచుతాయి.
అకౌంట్ రికవరీ సమాచారం మీ అకౌంట్ రికవరీ ప్రశ్నలు చాలా సెక్యూరిటీగా ఉంచుకోవాలి. మీ పర్సనల్ లైప్ కి సంబంధించిన ప్రశ్నలను సెక్యూరిటీగా ఉంచుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది.
కొత్త కంప్యూటర్లలో లాగౌట్ మరచిపోవద్దు మీరు అనేక రకాలైన కంప్యూటర్లలో అకౌంట్ లాగిన్ అవుతుంటారు. అటువంటి సమయంలో దాన్ని ఒక్కోసారి లాగౌట్ చేయడం మరిచిపోతారు. కాబట్టి కొత్త కంప్యూటర్లలో లాగిన్ అయితే లాగౌట్ చేయడం మరచిపోవద్దు.
టూ స్టెప్స్ వెరిఫికేషన్ మీరు మీ అకౌంట్ ని టూ స్టెప్స్ వెరిఫికేషన్స్ కింద పెట్టుకుంటే సురక్షితంగా ఉంటుంది. లాగిన్ యాక్టివిటీ లాగిన్ యాక్టివిటీ మీరు మీ అకౌంట్ యాక్టివిటీని లొకెషన్ ద్వారా సెట్ చేసుకోవడం ఉత్తమం. మీ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారో ఈజీగా తెలుసుకోవచ్చు.

Related posts

*

*

Top