సెన్సార్.. సభ్యులే ఇంత ఆసక్తిగా చూసారా…!?

ప్రస్తుతం సెన్సార్‌ టాక్‌ అనేది కూడా పబ్లిసిటీ వ్యవహారంగానే మారిపోయింది. తమ సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు బాగుందన్నారని ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీ షురూ చేస్తారు సినిమా జనాలు. తాజాగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సెన్సార్‌ టాక్‌ అంటూ ఓ రిపోర్ట్‌ బయటకి వచ్చింది. ఈ రిపోర్టును మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు.

ఆ వార్తల ప్రకారం… ఈ సినిమా చూడడానికి ఎప్పుడూ లేనంతగా మొత్తం 18 మంది సెన్సార్‌ సభ్యులూ హాజరయ్యారట. సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారట. మెగాస్టార్‌ డ్యాన్స్‌లకు, యాక్టింగ్‌‌కు అందరూ ఫిదా అయ్యారట.సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కానున్న‌ ఈ సినిమా సెన్సార్ తాజాగా పూర్త‌యింది. యు బై ఏ స‌ర్టిఫికెట్ ద‌క్కించుకుంది. ర‌న్ టైమ్ 147నిముషాలు. భారీ అంచ‌నాలున్న ఈ సినిమాపై సెన్సార్ రిపోర్ట్ ఇలా ఉంద‌ని ఫిలిం న‌గ‌ర్‌లో టాక్ మొద‌ల‌యింది.
రైతుల బ్యాక్ డ్రాప్‌లో, సామాజిక ఇతివృత్తం నేప‌థ్యంలో తెర‌కెక్కింది ఈ చిత్రం. ఖైదీ నెంబ‌ర్ 150లో చిరంజీవి ద్విపాత్రాభిన‌యంలో క‌నిపిస్తాడు. దాదాపు 9ఏళ్ల త‌ర్వాత క‌నిపించినా, చిరంజీవి స్క్రీన్ అప్పియ‌రెన్స్‌, మేజిక్ ఏమాత్రం త‌గ్గ‌లేదట‌. న‌ట‌న‌, డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్‌లో చిరంజీవి అద్భుతంగా క‌నిపించాడ‌ని సెన్సార్ వ‌ర్గాలు చెప్పాయ‌ట‌.

తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి చిత్రానికిది రీమేక్ అన్న విషయం తెలిసిందే . రైతు సమస్యలపై కమర్షియల్ అంశాలను జోడించి తీసిన ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి అద్భుత నటన , డ్యాన్స్ , డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించనుందట . అంతేనా ఈ వయసులో కూడా మెగా స్టార్ చిరంజీవి ఈ చిత్రంలో మరీ యంగ్ గా కనిపించడం మెగా ఫ్యాన్స్ కె కాదు యావత్ ప్రేక్షకులకు కూడా షాకిచ్చేలా ఉంటాడట . ఓవరాల్ గా చిరు సినిమా సూపర్ హిట్ అన్నది ఖాయమైంది అయితే రికార్డుల మోత ఏ రేంజ్ అన్నది తెలియాలంటే మాత్రం కొద్దీ రోజులు ఆగాల్సిందే .

*

*

Top