శివ పురాణ రహస్యాలు: శివుని దృష్టిలో ఈ పాపాలు చేసేవారికి పాపవిముక్తి దక్కనట్లే..!

శివుడు అమాయకుడైనా… తన కోపాన్ని తట్టుకోవడం ఎవరితరమూ కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు కలిసి వచ్చినా.. శివుని కోపాన్ని తట్టుకోలేరు. అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది. అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొన్ని ఉన్నాయి. మనుషులు ఈ పాపాలు కనుక చేస్తే శివుడు తప్పకుండ శిక్షిస్తాడని శివపురాణంలో ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు… అన్న విషయం అందరికి తెలిసిందే. అంటే ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ దైవాజ్ఞ లేకుండా జరగవని అర్ధం. పరమశివుడిని భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. అలాగే తన భక్తులు చేసే పాపాలను తను మింగి… సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు.

మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య పొందాలనే కోరిక ఉన్నవారు మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య లేదా భర్తను పొందాలనే ఆలోచన చేసినా అది క్షమించరాని పాపం.

ఇతరుల సంపదని పొందాలనే కోరిక ఉన్నవారు.. ఇతరుల సంపదని పొందాలనే కోరిక ఉండటం కూడా క్షమించరాని పాపం.

ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించడం.. ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించాలని, వారి కలలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం.

ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా.. ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా లేదా ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని పాపం.

గర్భిణి స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్థించడం.. గర్భిణి స్త్రీల పట్ల లేదా ఆ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా లదా వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం.

ఎవరినైనా ఉద్దేశించి.. వారి కీర్తి, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వారి గురించి అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం.

పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడుకోవడం.. అనవసరమైన పుకార్లు సృష్టించి, ఒకరి వెనకాల మాట్లాడి.. సమాజంలో వారికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నించినా అది క్షమించరాని పాపం.

అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం. హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం.

మహిళలు, చిన్న పిల్లలు పట్ల తప్పుగా ప్రవర్తించడం.. హింసాకాండలో పాల్గొనడం, మహిళలు, చిన్న పిల్లలు లేదా బలహీనమైన ప్రాణి పట్ల తప్పుగా ప్రవర్తించడం కూడా క్షమించరాని పాపం.

*

*

Top