వామ్మో శశికళ: ‘ఆయా నుంచి అన్నాడీఎంకే’చీఫ్ అయ్యారు

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతపట్టుకున్న నెచ్చెలి శశికళ ఇప్పుడు నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపించే సత్తా ఉందా ? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకు ఇంత వరకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.
శశికళ 10వ తరగతి వరకు చదువుకున్నారు. శశికళ భర్త నటరాజన్ జిల్లా కలెక్టర్ అయిన ఐఏఎస్ అధికారి చంద్రలేఖ దగ్గర పీఆర్ ఓగా పని చేసేవారు. ఆ సమయంలో శశికళ సొంతంగా వీడియో క్యాసెట్ల షాప్ పెట్టుకున్నారు. అయితే షాప్ అంతగా జరగకపోవడంతో ఆమె నష్టాలను చవిచూశారు.
ఓ రోజు నటరాజన్ తన భార్య శశికళ గురించి కలెకట్టర్ చంద్రలేఖ దగ్గర చెప్పారు. అదే సమయంలో చంద్రలేఖకు జన్మించిన బిడ్డను చూసుకోవడానికి ఒక ఆయా కావాలని నటరాజన్ తెలుసుకున్నారు. ఎలాగైనా శశికళను తెచ్చి చంద్రలేఖ దగ్గర ఆయాగా పనిలో పెట్టాలని నటరాజన్ నిర్ణయించారు.
తన భార్య మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుందని నటరాజన్ చెప్పడంతో కలెక్టర్ చంద్రలేఖ శశికళను ఆయాగా పెట్టుకున్నారు. ఆయాగా పని చెయ్యవలసిన అవసరం లేకపోయినా పెద్దలు పరిచయం అవుతారని శశికళ ఆ పనిలో చేరారు. అప్పుడు ఐఏఎస్ అధికారి అయిన చంద్రకళ వీడియో క్యాసెట్ల షాప్ పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉండదని, వీడియో కవరేజ్ చేస్తే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుందని శశికళకు సూచించారు.

Related posts

*

*

Top