వరుణ్ తేజ్‌కు థ్రిల్లింగ్ గిఫ్ట్.. !

వరుణ్ తేజ్‌కు థ్రిల్లింగ్ గిఫ్ట్.. !

ఎవరైనా బహుమతి ఇస్తే చెప్పలేనంత సంతోషం ఉంటుంది. అదే అమితంగా వ్యక్తి అపురూపమైన గిఫ్ట్‌ను ఇస్తే అది అందుకొన్న వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి ప్రస్తుతం అదే. ఎందుకంటే వరుణ్ తేజ్‌కు ఇటీవల ఓ అద్భుతమైన పెయింటింగ్‌ను బహుకరించింది. అది అందుకొన్న వరుణ్ తేజ్ ఆనందంలో మునిగిపోయాడు.

మెగా హీరోలకు భిన్నంగా మాస్ హీరోగా కాకుండా ఫీల్ గుడ్ చిత్రాలతో వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముకుందతో విలక్షణమైన నటనను ప్రదర్శించాడు. కంచె వరుణ్ తేజ్ విభిన్నమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన లోఫర్, ఇటీవల వచ్చిన మిస్టర్ చిత్రాలు కమర్షియల్ అంతగా సక్సెస్ సాధించకపోయినా నటనపరంగా వరుణ్ తేజ్ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు.

విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకొంటూ ప్రణాళికబద్ధంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటున్నాడు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి ఫిదా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే హ్యాండ్సమ్ లుక్‌తో కనిపించే వరుణ్‌కు మహిళా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.

అలా మహిళా ఫ్యాన్స్‌లో వ‌రుణ్‌ని ఎంత‌గానో అభిమానించే ఓ అభిమాని స్వయంగా వేసిన వరుణ్ తేజ్ పెయింటింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది చూసి చాలా థ్రిల్ ఫీల‌య్యాడు మెగా ప్రిన్స్ . ఈ పెయింటింగ్ కి లావ‌ణ్య త్రిపాఠి కూడా ఇంప్రెస్ అయింది.

పెయింటింగ్‌లో మీసాలు తిరిగిన వరుణ్ తేజ్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. పెయిటింగ్‌ను బహుకరించిన అభిమానితో వరుణ్ తేజ్ ఫొటో దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

*

*

Top