లోకేష్ రాజీనామా . . ! ?

లోకేష్-రాజీనామా

లోకేష్-రాజీనామా  : లోకేష్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్ననే ఎమ్మెల్సీ గా ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేష్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి రాక మునుపు నుంచే ఆయన తమ హెరిటేజ్ సంస్థ కు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత టీడీపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నా రెండు పదవులు సమర్ధ వంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే ఈరోజు అనూహ్యంగా లోకేష్ తన హెరిటేజ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. నిన్ననే ఎమ్మెల్సీ గా ప్రమాణస్వీకారం చేసిన లోకేష్ దానికి గల కారణాలు అయితే తెలుపలేదు. అయితే ఏప్రిల్ 2వ తేదిన జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫాం అవ్వడం వలనే అయన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసారని రాజకీయ విశ్లేషకుల వాదన. ఈరోజు అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో ఏప్రిల్ 2న విజయవాడలోనే ఉంటానని.. ఆ రోజు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంది కదా అని బాలకృష్ణ చెప్పడం ఈ వాదనకి బలం చేకూరుస్తోంది.

అయితే ఇప్పటిదాకా తనకి సహకరించిన సహచర డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ లోకేశ్ ట్వీట్ చేశారు. తన తల్లి భువనేశ్వరి , భార్య బ్రాహ్మణి సారధ్యంలో హెరిటేజ్ సంస్థ ఉన్నత శిఖరాలకు వెళ్తుందని అయన ఆశా భావం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

*

*

Top