లవంగాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయని మీకు తెలుసా?

లవంగాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయని మీకు తెలుసా?
లవంగాలు అనేక వ్యాధులకు చెక్ పెడతాయని మీకు తెలుసా?:

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాలు కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. ఒక్కసారి మీ వంటింట్లోని పోపులపెట్టెలోకి చూడండి…కనిపించాయా నల్లని పూమొగ్గలు… అవేనండీ లవంగాలు. అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు! విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాము. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బాంగ్లాదేశ్, బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పాకిస్తాన్, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలాప్రియులు. లవంగాల్లోని అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు… ఇది శృంగారప్రేరితం కూడానట. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే. వీటిలో మంచి సువాస మాద్రమే కాదు.. విలువైన పోషకాలు ఉన్నాయి. వీటిలో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడంెట్, అనస్తిటిక్, అనాల్జిక్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు… ఎ,సి ఉన్నాయి. మరి ఇన్ని పోషకాలు, ఔషదగుణాలున్న లవంగాలు ఆరోగ్య పరంగా ఏవిధంగా ఉపయోగపడుతాయో చూద్దాం..

నోటి దుర్వాసనను నివారిస్తుంది : లవంగాలలో ఆరోమా వాసన మాత్రమే కాదు, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల నోట్లో సూక్ష్మ క్రిములు పెరగకుండా నివారిస్తుంది. భోజనం తర్వాత కొన్ని లవంగాలను నోట్లో వేసుకుని నమలడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు .

లవంగాలు దంతాల నొప్పి మరియు చిగుళ్ళ సమస్యలను నివారిస్తుంది టూత్ పేస్ట్, మౌత్ వాష్, డెంటల్ క్రీమ్స్ లో లవంగాలను ఉపయోగిస్తారని తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యం కలగక మానదు. చిగుళ్ళ సమస్య నివారించుకోవడం కోసం డెంస్ట్రీ జింక్ యాక్సైడ్ యూజనోలన్ ను తాత్కాలికంగా ఉపయోగిస్తుంటారు. దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగించడం లవంగాలు గొప్పగా సహాయపడుతాయి.

పురాతన కాలం నుండి లవంగాలను వికారం తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. లవంగాలకు కొద్దిగా తేనె చేర్చి తీసుకోవడం వల్ల వికారం మరియు వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది. లవంగాలు జీర్ణశక్తిని పెంచుతాయి. లవంగాల్లో ఉండే యాంటీ అనస్థిటిక్ లక్షణాలు స్టొమక్ లైనింగ్ మీద పనిచేసి రిఫ్లెక్షన్ ను నివారిస్తుంది.

ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో చాలా మంది మహిళలు వాంతులు, వికారం సమస్యలను ఎదుర్కొంటారు. వాంతులు, వికారంతో పాటు, నీరసం కూడా బాధిస్తుంటుంది. ఈ మార్నింగ్ సిక్ నెస్ లక్షణాలను నివారించడంలో లవంగాలు గ్రేట్ హోం రెమెడీ.

జీర్ణ శక్తిని పెంచే లవంగాలు : జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడే జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణ శక్తి పెరగుతుంది. లవంగాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, ఆపానవాయువు వంటి సమస్యలను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. మోటిలిటిని పెంచి మలబద్దక సమస్యలను నివారించుకోవచ్చు. లవంగాలను ప్రతిరోజూ కూరల్లో వాడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి, పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి : లవంగాల్లో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణంగా వచ్చే జలుబు దగ్గును నివారిస్తుంది. లవంగాలు ఉడికించిన నీటిని నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

లవంగాల్లో గ్లూకోజ్ ను తగ్గించే గుణాలున్నట్లు కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి.మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మధుమేహంతో బాధపడే వారు వీటిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలోని మహిళలకు వీటితో ఎంతో మేలు.

తలనొప్పి నుండి ఉపశమనం కలిగించే లవంగాలు :తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడీ, రాతి ఉప్పూ వేసి తాగాలి. దీనివల్ల కాసేపటికి తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

లవంగాలు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. కండరాలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తాయి.

చర్మ సమస్యలను నివారిస్తుంది: ఎలాంటి చర్మ వ్యాధులనైనా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అందుకోసం లవంగాలను చందనంతో పాటు మెత్గగా పేస్ట్ చేసి ఇన్ఫెక్షన్, దురద లేదా ఇతర చర్మ సమస్యలున్న ప్రదేశంలో అప్లై చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వగా తగ్గుతాయి.

*

*

Top