రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్ ఒక గంట మాత్రమే

రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్ ఒక గంట మాత్రమే
రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్  ఒక గంట మాత్రమే:అత్యంత తక్కువ ధరలో లాంచ్ అయి అమ్మకాల్లో దుమ్మురేపుతున్న షియోమి రెడ్‌మి 4A అన్ని ఫోన్లకు షాకిస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మరోసారి ఈ ఫోన్ నేడు విక్రయానికి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాల్లో షియోమి దీన్ని విక్రయానికి ఉంచుతోంది. అయితే ముందస్తు మాదిరిగా కాకుండా.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ ఫోన్ సేల్ ను కంపెనీ చేపట్టనుంది.

గ్రేట్ ఇండియన్ సేల్ లో సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీనికి వర్తించవు.

ఈ ఫోన్ కొనుగోలుపై ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అందించే డేటా ఆఫర్లు మాత్రం నేటి సేల్ లో అందుబాటులో ఉంటాయి.

343 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై యూజర్లు 28జీబీ 4జీ డేటాను పొందవచ్చు.

డేటాతో పాటు రెడ్ మి 4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 ఉచిత ఎస్టీడీ, లోకల్ ఎస్ఎంఎస్ లు పొందుతారు. 28 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్లు వాలిడ్ లో ఉంటాయి

*

*

Top