మోడీ కెసిఆర్ కి చెప్పిన “ఆ విషయం” కెసిఆర్ చంద్రబాబు కి చెప్పారు

రాజకీయ నాయకుల తీరు లో లోపాలు ఉంటాయి .. కెసిఆర్ శైలి లో లోపాలు ఉన్నా లేకపోయినా కెసిఆర్ విలక్షణమైన రాజకీయ నాయకుడు. తిట్టాల్సివచ్చినప్పుడు తిట్టేసి అదే వ్యక్తి బయట కనిపిస్తే పలకరిస్తారు. అది ఎవ్వరికీ అర్ధం కాని స్టైల్. అదేంటో మరి, చంద్రబాబు గారిని ఎన్ని మాటలు అన్నా కెసిఆర్ కి తనివి తీరదు. చంద్రబాబూ హైదరాబాద్ నీయబ్బ జాగీరా ? అంటూ అరిచేది ఆయనే .. ఫున్సిటన్ లలో వెళ్లి కావలించుకునేది ఆయనే. ఎదురెదురుగా ఉన్నప్పుడు మాత్రం రాజకీయాలని వదిలేసి మాట్లాడడం కొత్త రాజకీయం కాబోలు.
రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందు కి ఇద్దరు చంద్రుళ్ళూ హాజరు అవ్వడంతో వేదిక అంతా తళతళ లాడిపోయింది. ఈ చోటులో కెసిఆర్ – చంద్రబాబు ఒక ప్రత్యెక అంశం గురించ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు అంశంపై తనతో ప్రధాని మాట్లాడిన మాటల్ని కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా.. దానికి ముందస్తు కసరత్తు కొంత చేసి ఉంటే బాగుండేదని.. కరెన్సీ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తాను తీసుకెళ్లినట్లుగా కేసీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాని తనతో భావోద్వేగంగా మాట్లాడారని చెప్పారు.తనను ఒక రాష్ట్రం ప్రజలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని.. తనలాంటి సాధారణ వ్యక్తిని దేశ ప్రజలు ప్రధానిని చేశారని.. వారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో.. అంతా ఆలోచించే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నప్పుడు.. దేనికైనా సిద్ధమయ్యే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారని చంద్రబాబుతో కేసీఆర్ చెప్పారు.

Related posts

*

*

Top