మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..

మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..
మొటిమల నివారణకు నిమ్మరసంతో అద్భుత ఫలితాలు..మొటిమల నివారణకు నిమ్మరసం, నిమ్మరసం ఫేస్ ప్యాక్ తో మొటిమలు మాయం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందు మొటిమలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం..ఈ మద్య కాలంలో మనం తినే ఆహార పదార్థాల వల్ల (జంగ్ ఫుడ్స్) తో శరీరంలో రక రకాల మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా యువతీ యువకులకు మొటిమల ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుంది. సాధారణంగా యుక్త వయసు వచ్చిన వారికి మొటిమలు అనేవి సహజంగా వస్తుంటాయి. అమ్మాయిల్ని వేధించే అతి పెద్ద సమస్య మొటిమలు.ముఖం మ్మీద ముత్యమంత మొటిమ కనిపించగానే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ తమవే అన్నంత ఫీలైపోతారు అమ్మాయిలు. అంత గాభరా పడాల్సిన అవసరం లేదు. వీటి నివారణకు అనేక రకాల క్రీమ్స్ ఉపయోగించి విసిగిపోయారా? అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే నిమ్మరసం వంటి పదార్దాలను ఉపయోగించి మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్, సిట్రిక్ ఆసిడ్, విటమిన్ సీ, పాస్పరస్, విటమిన్ బీ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆసిడ్ చర్మానికి చాలా మంచిది. చర్మాన్ని వివిధ రకాల బాహ్యా కారకాల నుండి కాపాడుతుంది. నిమ్మరసం చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలను, వయసు మీరుతున్న కొద్దీ చర్మంపై కలిగే మార్పులను తగ్గిస్తుంది.

ముఖంపై నిమ్మరసాన్ని అప్లై చేయటం వలన కొద్ది రోజులలోనే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడుతాయి. అవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి. ఇప్పుడు మొటిమల నివారణకు నిమ్మతో తయారుచేసే ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

మొటిమల మీద :నిమ్మరసాన్ని రాయాలి ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని పిండి, దూదితో పింపుల్స్‌ మచ్చలపై రాస్తే క్రమేణా మాయమవుతాయి. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు నిమ్మరసాన్ని శరీరానికి రాసి, ఆపై స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చర్మంపై ఏర్పడే చికెన్‌ ఫాక్స్‌ మచ్చలు పోవాలంటే నిమ్మరసంతో :ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మంచిదని వైద్యులంటున్నారు. చికెన్‌ ఫాక్స్‌ మచ్చలు పోవాలంటే పసుపు, కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసం కలిపి శరీరంలోని చికెన్‌ ఫాక్స్‌ మచ్చలపై రాసి, పావుగంట తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

చర్మం నిగారింపుకు నిమ్మరసం: ఇక పింపుల్స్‌ పూర్తిగా తొలగిపోవాలంటే నిమ్మరసాన్ని దూదితో అప్లై చేసి, అరగంట తర్వాత కడిగేయండి. ఇలా కొన్ని రోజులు చేస్తే పింపుల్స్‌ పూర్తిగా పోతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు చర్మం నిగారింపు మెరుగుపడుతుంది.

పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం :కలిపి కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

శెనగపిండిలో నిమ్మరసం :ఒక స్పూన్ పచ్చి శనగల పొడిలో నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత కడగాలి. చర్మం పొడిగా అన్పిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ప్రతి రోజు ఈ ప్యాక్ ముఖానికి వేస్తే మంచి పలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గుడ్డు తెల్లసొన ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మూడు బాగాలుగా చేయాలి. ఈ మిశ్రమంలో ఒక బాగాన్ని ముఖానికి రాసి ఐదు నిముషాలు అయ్యాక రెండో బాగాన్ని రాసి మరో ఐదు నిముషాలు అయ్యాక మూడో బాగాన్ని రాయాలి. మూడో పొర ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఒక స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మొటిమల ప్రభావిత ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.

*

*

Top