మీరు మీ పిల్లలకు పండ్లు ఇస్తున్నారా ?

తాజా పండ్లు కూరగాయలతో చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా సరే పోషకాహారం అత్యవసరం. అందుకే పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. అవే మనకు అనారోగ్యాన్ని దరిచేరనీయకుండా కాపాడే పోషకాలు అందిస్తాయి.

అయితే చిన్నారులకు పండ్లూ కూరగాయలు పెడుతున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలనంటున్నారు పోషకాహార నిపుణులు. ఎలా పడితే అలా ఏపండు పడితే ఆపండు కలిపి పెడితే ఆహారం విషతుల్యం అవుతుంది. మరి వేటిని వేటితో కలిపి చిన్నారులకు పెట్టకూడదో, ఎలాంటి ఆహారం పెట్టచ్చో తెలుసుకోండి !
ఇలా పెట్టకండి
కొందరు ఎక్కువ పోషకాలు కావాలని రెండు రెండు పండ్లు కలిపి పెడుతుంటారు. అలా పెట్టడమూ మంచిది కాదు. ముఖ్యంగా కింది వాటిని అస్సలు కలిపి పెట్టకూడదు.
కమలాఫలం, క్యారెట్‌ : ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల చిన్నారుల గుండెల్లో మంట, వికారంగా అనిపించడం మూత్ర వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్బాల్లో వీటి ముప్పు పెరిగే అవకాశం కూడా ఉంది.
బొప్పాయి.పండు, నిమ్మ : వీటిని కలిపి తినడం వల్ల హిమోగ్లోబిన్‌ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా చిన్నారులకు ఎనీమియాకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ రెంటినీ కలిపి చిన్నారులకు పెట్టకపోవడం ఉత్తమం.
జామపండు, అరటిపండు : చిన్నారులకు కలిపి పెట్టకూడని పండ్లలో జామ, అరటి కూడా ఉన్నాయి. వీటిని ఒకే సమయంలో తినడం వల్ల చిన్నారుల్లో జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి కడుపునొప్పి వికారంగా కూడా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎసిడోసిన్‌ అంటే రక్తం, ఇతర శరీర కణజాలాల్లో ఆమ్లస్థాయి పెరుగుతాయి. ఇలాంటి అవకాశాలూ లేకపోలేదు.
పాలతో వీటిని పెట్టకండి!
చాలామంది తల్లలు చిన్నారులకు పాలతో పాటు పండ్లు కూడా తినమని ఇస్తుంటారు. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. అయితే పాలతో కలిపి కొన్ని రకాల పండ్లు చిన్నారులకు ఆహారంగా ఇవ్వకూడదు. అవేంటంటే
కమలాఫలం, పాలు : చిన్నారులకు ఈరెంటినీ ఒకేసారి ఆహారంగా ఇస్తే వారిలో జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కమలాఫలమే కాదు, దాన్నుంచి తీసిన రసం కూడా పాలు తాగిన వెంటనే ఇవ్వకూడదు.
పైనాపిల్‌, పాలు : పైనాపిల్‌లో ఉండే బ్రోమిలెన్‌ పదార్థం పాలల్లో కలిపినప్పుడు విషపూరితంగా మారుతుంది. దీనికారణంగా తలనొప్పి, కడుపునొప్పి వస్తాయి. అలాగే జీర్ణకోశ సంబంధిత సమస్య ఉత్పన్నమవుతుంది. వాంతులు అవుతాయి. కొన్ని సందర్బాల్లో ఇన్ఫెక్షన్లకు లేదా డయేరియాకు దారితీస్తుంది.
కూరగాయలతో తినకండి
కొంతమంది కూరగాయలు, పండ్లు కలిపి సలాడ్‌ తయారుచేస్తుంటారు. ఇలాంటివి పెద్దలు తింటే ఫర్వాలేదు కానీ చిన్నారులకు పెట్టడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశముందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే పండ్లలో ఉండే చక్కెరలు కారణంగా కూరగాయలు సరిగ్గా జీర్ణం కావు. ఫలితంగా జీర్ణవ్యవస్థకు ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంది. అలాగే ఆహారం సరిగ్గా అరగని కారణంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
వీటిని తినొచ్చు
ఒకేరకమైన స్వభావం ఉండే పండ్లను కలిపి ఆహారంగా అందించడం ద్వారా చిన్నారుల్లో జీర్ణసంబంధ సమస్యలు ఇతర అనారోగ్య కారణాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
1. పీచ్‌, యాపిల్‌, తర్బూజా, పుచ్చ, ఫిగ్‌, ఖర్జూరం వంటి స్వీట్‌ ఫ్రూట్‌ రకానికి చెందిన పండ్లను కలిపి తినొచ్చు.
2. సిట్రస్‌ జాతికి చెందిన పండ్లు అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివీ, ద్రాక్ష, పైనాపిల్‌, చెర్రీ, క్రాన్‌బెర్రీ, వంటివన్నీ ఆమ్లగుణాలున్న పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిని కూడా కలిపి చిన్నారులకు ఆహారంగా అందివచ్చు.
3. మామిడి, రాస్బెర్రీ, గ్రీన్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, యాపిల్‌ వంటివి సెమీ యాసిడ్‌ రకానికి చెందిన పండ్లు వీటిని సైతం పిల్లలకు మిశ్రమంగా చేసి అందించవచ్చు.
4. ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, నూనెలు వంటి గుణాలు కలగలిసిన పదార్థాలు తటస్థ రకానికి చెందినవి, అంటే అవకాడో, బాదాం, కొబ్బరి, వాల్‌నట్‌ లాంటివన్నమాట. వీటన్నింటినీ కూడా కలిపి తీసుకోవచ్చు.

*

*

Top