మిస్టర్ మూవీ రివ్యూ

మిస్టర్ మూవీ రివ్యూ

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన లోఫర్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్. ముకుంద, కంచె లాంటి సినిమాలకు మంచి పేరు వచ్చినా వరుణ్‌కు అనుకున్న రేంజ్‌లో హిట్‌ను అందించలేకపోయాయి. దూకుడు, బాద్షా లాంటి బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకొన్న దర్శకుడు శ్రీను వైట్లకు ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల తర్వాత పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, శ్రీను వైట్ల నిలదొక్కుకోవాలంటే వారికి కావాల్సింది భారీ హిట్. అలాంటి పరిస్థితుల్లో వారిద్దరూ కలిసి చేసిన సినిమా మిస్టర్. ఈ చిత్రానికి వరుస విజయాలతో దూసుకెళ్తున్న లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు జతకలిశారు. ఇలాంటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం వారికి ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే అసలు మిస్టర్ కథ ఏంటీ అనేది తెలుసుకోవాల్సిందే. .

కథ:

పిచ్చయ్య నాయుడు అలియాస్ చయ్ ( వరుణ్ తేజ్) స్పెయిన్‌లో జాలీగా గడిపే యువకుడు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకొంటారు. తనకు నచ్చిన వాళ్లు కష్టాల్లో ఉంటే తన కష్టంగా భావించి వారికి అండగా ఉండే లక్షణం. స్పెయిన్ పర్యటనకు వచ్చిన మీరా (హెబ్బా పటేల్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ అప్పటికే మీరాకు ఇండియాలో ఉండే సిద్ధార్ఠ్ (ప్రిన్స్)తో అఫైర్ ఉంటుంది. అది తెలిసి చయ్ హర్ట్ అవుతాడు. తొలి ప్రేమ బెడిసి కొట్టడంతో బాధ పడుతాడు. స్పెయిన్ టూర్ ముగించుకొని కర్ణాటక ప్రాంతంలోని తన సొంతూరుకు తిరిగి వచ్చిన మీరా కష్టాల్లో పడుతుంది. తన కష్టాన్ని చయ్‌కి చెప్పి బాధపడుతుంది. కష్టాల్లో పడిన మీరాను గట్టెక్కించడానికి చయ్ ఇండియా వస్తాడు.

ఇండియాకు వచ్చే సమయంలో తన కుటుంబ సభ్యులు తాతయ్య (పిచ్చయ్య నాయుడు)ను కలువాలని చయ్‌ని కోరుతారు. అయితే చయ్‌కి తాతయ్య పిచ్చయ్య నాయుడు అంటే చెప్పలేనంత కోపం. కర్ణాటక ప్రాంతానికి సమీపంలోని ఓ ప్రాంతానికి తాత పిచ్చయ్యనాయుడు పెద్ద.కర్ణాటక ప్రాంతానికి వచ్చిన చయ్‌కి విజయనగర రాజకుటుంబానికి చెందిన చంద్రముఖి (లావణ్య ) తారసపడుతుంది. ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన చంద్రముఖి చయ్‌కి దగ్గరవుతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా చయ్‌ని చంద్రముఖి ప్రేమిస్తుంది. చయ్‌కి తాను అంటే ఇష్టమని మీరాకు తెలుస్తుంది.

పిచ్చయ్య నాయుడుకి ఓ సమస్య ఉంటుంది. చయ్‌ని తన చివరి రోజుల్లో పిచ్చయ్య నాయుడు చూడాలనుకొంటాడు.

ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న మీరాను ఎలా గట్టెక్కించాడు? మీరాకు ఎదురైన సమస్య ఏంటి? తాతయ్య అంటే చయ్‌కి ఎందుకు కోపం. చంద్రముఖి ఇంటి నుంచి ఎందుకు పారిపోయి వచ్చింది? తాత పిచ్చయ్యకు ఉన్న సమస్య ఏంటి? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ చిత్రం. ఇలాంటి సమస్యలను చయ్ ఎలా ఎదురించాడనేది కథకు ముగింపు.

*

*

Top