మహాభారతం అంటే ఇదీ అనేలా తీస్తాను: రాజమౌళి

మహాభారతం అంటే ఇదీ అనేలా తీస్తాను: రాజమౌళి

మహాభారతం అంటే ఇదీ అనేలా తీస్తాను: రాజమౌళి మహాభారతం.. దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. మహాభారతం లాంటి బిగ్ ప్రాజెక్ట్‌కు సన్నాహకంగానే బాహుబలి లాంటి సినిమాను ఇండస్ట్రీకి రాజమౌళి పరిచయం చేశారంటూ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చర్చలు నడిచాయి. అయితే.. మహాభారతాన్ని తీసే ఆలోచనేదీ తనకిప్పుడు లేదని, మరో పదేళ్లు పడుతుందని కొన్నాళ్ల క్రితం రాజమౌళి ప్రకటించారు కూడా. అయితే.. ఆ లోపు మహాభారతాన్ని తీస్తున్నామంటూ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు. మరి, మహాభారతంపై రాజమౌళి మనసులోని మాటేంటి..? ఆ విషయాన్ని ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వెల్లడించారు రాజమౌళి. అప్పుడు తాను అన్న పదేళ్లలో రెండు సంవత్సరాలు తగ్గించి మరో 8 ఏళ్లలో మహాభారతాన్ని తీస్తానంటూ చెప్పుకొచ్చారు.

*

*

Top