‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌

‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌

‘మహానటి’ని అద్భుతంగా చిత్రీకరిస్తున్న హాలీవుడ్‌ కెమెరామెన్‌:

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. కథ పరంగానే కాకుండా నాణ్యత పరంగానూ చిత్ర బృందం రాజీ పడడం లేదు. అందుకే  హాలీవుడ్‌ కెమెరామెన్‌ డాని సాంషెజ్‌లోపేజ్‌ ని కెమెరామెన్‌గా తీసుకున్నారు.

ప్రస్తుతం ఈయన గండిపేటలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత స్వప్న దత్‌ మాట్లాడుతూ.. ‘‘కొన్ని అంతర్జాతీయ ప్రకటనలు, మ్యూజిక్‌ వీడియోలను చిత్రీకరించిన డానీ లాంటి ప్రతిభ ఉన్న టెక్నీషియన్‌ ‘మహానటి’ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

*

*

Top