బొత్స వలన జగన్ కు పంచ్ పడింది..!

ఇప్పటికే వరుస నేతల వలసలతో వైసిపి సతమతమవుతోంది.కాగా ఆపార్టీ అధినేత జగన్ కు మరో షాక్ తగిలింది. విజయనగరం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్సీ కొలగొట్ల వీరభద్రస్వామి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో బొత్ససత్యనారాయణ వర్గం ఆధిపత్య పోరు కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.బొత్స సత్యనారాణయ వర్గం కోలగట్ల కి తగిన గౌరవం ఇవ్వకపోవడం వల్లనే ఆయన పార్టీ అధ్యక్ష పదవి కి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అనంతరం ఆయన తన అనుచరులతో భేటీ అయినట్లు కూడా సమాచారం.

దీనితో కోలగట్ల పార్టీ మారుతున్నారా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. కోలగట్ల రాజీనామా విషయం పార్టీ లోని ముఖ్యనేతలకు తెలిసినా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. దీనితో వైసిపికి కోలగట్లకు సంబంధాలు తెగిపోయాయని ఆయన పార్టీ మారడం ఖాయమని జిల్లాలోని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జిల్లాలో కోలగట్ల వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ని ఇవ్వకపోవడం, జిల్లా అధ్యక్షుడిగా తాను చేయాల్సిన పనులను కూడా బొత్స మేనల్లుడు చేస్తుండడం తో కోలగట్ల ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కోలగట్లను అధినాయకత్వం బుజ్జగించకుంటే వైసిపి మరో ఎమ్మెల్సీ ని వదులుకోవాల్సిందే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి

Related posts

*

*

Top