ప్రభాస్, రణ్‌వీర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి నెక్ట్స్ మూవీ..!

ప్రభాస్, రణ్‌వీర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి నెక్ట్స్ మూవీ..!
ప్రభాస్, రణ్‌వీర్‌ కాంబినేషన్‌లో రాజమౌళి నెక్ట్స్ మూవీ:బాహుబలి2 చిత్రం విజయం, సాధిస్తున్న రికార్డుల గురించి పక్కన పెడితే.. ఈ చిత్రం తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. మోహన్‌లాల్‌తో గరుడు అని కొందరు, రజనీకాంత్‌ కోసం కథ తయారు చేస్తున్నాడని మరికొందరు, లేదు లేదు కరణ్ జోహర్‌ సూచన మేరకు ప్రభాస్‌తో బాలీవుడ్ సినిమా చేస్తున్నాడనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీటికి తోడు తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. రాజమౌళి చేయబోయే చిత్రం ఫాంటసీ చిత్రమని, అందులో ప్రభాస్ మరియ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఉంటారని ఓ వార్త విస్తృతంగా ప్రచారమవుతున్నది. అయితే ఈ వార్తకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ మాత్రం లేకపోవడంతో అది రూమరా? లేదా వాస్తవామా? అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతున్నది.

సంచలన దర్శకుడు రాజమౌళి తీయబోయే సినిమా ఫాంటసీ చిత్రమట. ఆ చిత్రం బాహుబలి2 మాదిరిగానే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారనేది వార్త సారాంశం. తాను తీయబోయే సినిమా కథకు తగినట్టుగా ఇప్పటికే నేషనల్ ఐకాన్‌గా మారిన ప్రభాస్‌, బాలీవుడ్‌లో కండలవీరుడిగా పేరున్న రణ్‌వీర్‌సింగ్‌ కాంబినేషన్‌లో సినిమాను రూపొందించానే వార్త సర్కులేట్ అవుతున్నది.

బాలీవుడ్‌లో రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాలతో రణ్‌వీర్ సింగ్‌ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకొన్నాడు. ప్రస్తుతం పద్మావతి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో రూపొందినవే కావడం గమనార్హం. ఈ చిత్రాలే కాకుండా ఫైండింగ్ ఫ్యానీ, లుటేరా, దిల్ దడ్కనే దో సినిమాలు రణ్‌వీర్‌కు మంచి పేరు సంపాదించిపెట్టాయి. దేశవ్యాప్తంగా యూత్‌లో రణ్‌వీర్ సింగ్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉండటం వల్ల సినిమా మార్కెటింగ్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ రణ్‌వీర్‌పై దృష్టిపడటానికి అనుకూలంగా మారాయనేది తాజా టాక్.

ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పేదిమీ లేదు. వారి కలయినలో వచ్చిన ఛత్రపతి, బాహుబలి1, బాహుబలి2 చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. వారిద్దరి మధ్య వర్క్‌పరంగా మంచి కెమిస్ట్రీ ఉందడటానికి బాహుబలి నిదర్శనంగా నిలిచింది. ప్రభాస్‌తో రాజమౌళి, రాజమౌళితో ప్రభాస్ కలిసి పనిచేయడానికి వారి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవనవి ఇండస్ట్రీలో టాక్.

సాంఘీక చిత్రమైనా గానీ, ఫాంటసీ చిత్రమైనా గానీ, బాహుబలి లాంటి రాజుల నాటి కథనైనా గానీ ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరకెక్కించడంలో రాజమౌళికి ఆయనే సాటి. బాహుబలి చిత్రం రాజమౌళి గ్రాఫ్‌ను ఎక్కడోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత జక్కన తీయబోయే సినిమా ఎంటనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.

బాహుబలి తర్వాత రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఎంచుకొనే కథ, హీరోలు ఎవరనేది కీలకంగా మారింది. దాంతో బాహుబలి స్థాయిలో కాకపోయినా ఆ రేంజ్ ఉన్న సినిమా తీయాలంటే ప్రభాస్, రణ్‌వీర్‌సింగ్ లాంటి హీరోలు తప్పనిసరి అనే మాట వినిపిస్తున్నది.

బాహుబలి తర్వాత దక్షిణాదికే కాకుండా నేషనల్ వైడ్‌గా ప్రభాస్ స్టార్ పవర్ పెరిగింది. ఇప్పటికే రణ్‌వీర్‌కు బాలీవుడ్‌లో స్టార్ హోదా ఉంది. ఇక వీరిద్దరిని కలిపి సినిమా తీస్తే యూత్‌ను మరోసారి ఆకర్షించడం రాజమౌళికి సులభం అవుతుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తీకరిస్తున్నాయి.

రణ్‌వీర్ సింగ్ నటించిన చిత్రాలు బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు సాధించాయి. ఆయన నటించిన రెండు, మూడు చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇక ప్రభాస్ విషయం కొస్తే గతంలో వంద కోట్ల రికార్డు లేకపోయినా బాహుబలితో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇక రూ.1500 కోట్ల వసూళ్ల లక్ష్యంగా పరుగు తీస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తీస్తే భారీ కలెక్షన్లు సాధించడం రాజమౌళికి మరోసారి సులభం అవుతుంది.

*

*

Top