నిద్రించడానికి అరగంట ముందు ఏమిచేస్తే బరువు తగ్గుతారు!

నిద్రించడానికి అరగంట ముందు ఏమిచేస్తే బరువు తగ్గుతారు!

నిద్రించడానికి అరగంట ముందు ఏమిచేస్తే  బరువు తగ్గుతారు! ప్రస్తుతం ఈ మోడ్రన్ ప్రపంచంలో బరువు తగ్గించుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అయితే అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటారు. ఎలాంటి ఫలితం చూపకపోవడంతో చివరికి ప్రయత్నించడం మానేస్తుంటారు. బరువు తగ్గించుకునే క్రమంలో ఎన్నో ప్రయత్నాలను చేసుంటారు. అయితే బెడ్ టైమ్ లో కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల బరువు తగ్గిస్తాయన్న విషయం మీకు తెలుసా.?

రాత్రుల్లో నిద్రించడానికి 30 నిముషాల ముందు ఈ అలవాట్లు కనుక చేసుకున్నట్లైతే ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవడం సులభం అవుతుంది. రాత్రి నిద్రించడానికి అరగంట ముందు ఈ పనులు చేయడం వల్ల తప్పకుండా ఎఫెక్టివ్ గా బరువు తగ్గే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ అలవాట్ల వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. బరువు పెరుగుతామన్న భయం ఉండదు.అందుకు మీరు చేయాల్సిందల్లా మీ దినచర్యలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడమే. ఈ మార్పుల వల్ల డైలీ వెయిట్ లాస్ గోల్స్ ను చేరుకుంటారు. కాబట్టి, ఆలస్యం చేయకుండా బరువు తగ్గించుకోవడానికి బెడ్ టైమ్ హ్యాబిట్స్ ఏంటో..ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం…

నిద్రించే ముందు ఒక కప్పు టీ తాగాలి:

రాత్రి నిద్రించడానికి అరగంట ముందు ఒక కప్పు గ్రీన్ టీ లేదా రూయ్బోస్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. ఈ రకమైన టీలలో ఉండే ఆస్పథలిన్ అనే ఫ్లెవనాయిడ్స్ బెల్లీ ఫ్యాట్ కు చాలా మేలు చేస్తుంది. ఈ కాంపౌండ్స్ స్ట్రెస్ హార్మోన్స్ ను తగ్గిస్తుంది. ఇది ఆకలి కంట్రోల్ చేసి, ఫ్యాట్ నిల్వ చేరకుండా నివారిస్తుంది.

ఒక రోజుకు మీకు నిద్ర ఎంత అవసరమో తెలుసుకోవాలి:

బరువు తగ్గించుకోవడానికి నిద్ర కూడా సహాయపడుతుంది. రోజుకు సరిపడా 8 గంటలు నిద్రపోవడం వల్ల గ్రెలిన్ తగ్గుతుంది మరియు లెప్టిన్ పెరుగుతుంది. ఇది రోజంతా ఆకలి కాకుండా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

రొటీన్ గా చేసే పనులు :
ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే రాత్రి నిద్రించడానికి ముందు చేయాల్సిన ఈ పనులను అలవాట్లుగా మార్చుకోవాలి. రొటీన్ గా చేయడం వల్ల ఫలితం ఎఫెక్టివ్ గా ఉంటుంది. రాత్రి నిద్రించడానికి అరగంట ముందు రాయడం, బుక్స్ చదవడం లేదా కాటేజ్ చీజ్ తినడం వంటివి అలవాట్లుగా మార్చుకోవాలి.

కాటేజ్ చీజ్ :
రాత్రి నిద్రించడానికి ముందు కాటేజ్ చీజ్ తినడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్ ప్రోటీన్, ట్రెప్టోఫోన్ పొట్ట నిండే అనుభూతిని కలిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

వంటపనులు త్వరగా పూర్తి చేయాలి:
వంటపనులు తర్వాగా ముగించడం వల్ల రాత్రుల్లో డిన్నర్ త్వరగా తింటారు, త్వరగా నిద్రపోతారు. ఈ సింపుల్ చిట్కా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం 10 గంటల వరకూ బ్రెక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొవ్వు కరగడానికి ఈ సమయం గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో స్లిమ్ గా మారుతారు.

ప్రోటీన్ షేక్ తీసుకోవడం :
నిద్రించడానికి ముందు బాడీ మెటబాలిజం రేటు పెంచుకోవాలంటే ప్రోటీన్ షేక్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ లేదా ఫ్యాట్ ఫుడ్స్ కంటే ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా సహాయపడుతాయి. శరీరానికి అదనపు క్యాలరీలు చేరకుండా, ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేయడానికి సహాపడుతాయి.

*

*

Top