జియో యూజర్లకు మరో ఆఫర్

Reliance-Jio-SIM-Cards

జియో తన యూజర్ల కోసం లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.9,999 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 810జీబి 4జీ డేటా లభిస్తోంది. ఈ డేటాను 14 నెలల వాడుకోవచ్చు

ఇదే ప్లాన్‌ను నాన్ జియో ప్రైమ్ యూజర్లు సబ్ స్ర్కైబ్ చేసుకున్నట్లయితే కేవలం 750జీబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. వ్యాలిడిటీ కూడా 12 నెలలు మాత్రమే. రోజువారి ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. 810జీబి డేటా ముగిసిన వెంటనే డేటా వేగం 128 Kbpsకు పడిపోతుంది.

రూ.9,999 ప్లాన్ తో పాటు రూ.4,999 ప్లాన్‌ను కూడా జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.4,999 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 410జీబి 4జీ డేటా లభిస్తుంది. ఈ డేటాను 8 నెలల పాటు వాడుకోవచ్చు. ఇదే ప్లాన్‌ను నాన్ జియో ప్రైమ్ యూజర్లు సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే కేవలం 350జీబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. వ్యాలిడిటీ కూడా 6 నెలలు మాత్రమే.

*

*

Top