చేతుల మీద ముడుతలను తొలగించే సింపుల్ టిప్స్

చేతుల మీద ముడుతలను తొలగించే సింపుల్ టిప్స్
ముడుతలు ఏర్పడటం కామన్ ప్రాబ్లెమ్, వయస్పు పెరిగే కొద్ది చర్మంలో ముడుతలు ఏర్పడటం సహజం. ఈ ఏజింగ్ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయంటే మీకు వయస్సు అయిపోతుందని కాదు, స్కిన్ డ్యామేజ్ వల్ల కూడా చర్మంలో ముడుతలు ఏర్పడుతాయి. 20ఏళ్ళలో ఉన్న వారికి కూడా ముడుతలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల్లో కూడా చర్మంలో ముడుతలు కనబడుతాయి, అంత మాత్రనా వయస్సైనవారిగా భావించకూడదు. ఇది కేవలం చర్మం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. మహిళలు ముఖం గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ మరియు రెగ్యులర్ మసాజ్ వల్ల చర్మం చూడటానికి యంగ్ గా కనబడుతుంది. అయితే ముఖానికి తీసుకునే జాగ్రత్తలు చేతులు, కాళ్ళ మీద అంతగా తీసుకోకపోవడం వల్ల చర్మంలో ముడుతలు ఏర్పడుతాయి. ముఖ్యంగా చేతులు మీద త్వరగా బహిర్గతమౌతాయి.

ముఖంలో కంటే చేతుల మీద ముడుతలను ఎక్కువగా ఏర్పడుతాయి. దాంతో వయస్సైన వారిలా కనబడుతాయి. కాబట్టి, చర్మానికి తగిన చర్మ సంరక్షణ ఇవ్వడం చాలా అవసరం. చాలా వరకూ మన డిస్కస్ చేసిన బ్యూటి ఆర్టికల్స్ ప్రకారం మనం లోషన్స్ మరియు క్రీములకు అలవాటు పడకూడదు. వీటి వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది. కాబట్టి, సింపుల్ గా కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి చేతి మీద ఉన్న ముడుతలను మాయం చేసుకోవచ్చు. చేతుల మీద ఏర్పడే ముడుతలను నివారించడంలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్ చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. దీన్ని ఇంటర్నల్ గా తీసుకున్నా, ఎక్స్ టర్నల్ గా అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో ముడుతలను మాయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ చేతులకు ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం మంచిది. స్నానానికి వెళ్లడానికి అరగంట ముందు, అలాగే రాత్రి నిద్రించడానికి ముందు కూడా ఆలివ్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయాలి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది.

బననాతో ప్యాక్ : అరటి పండులో ఉండే ఐరన్ మరియు ఇతర మినిరల్స్ ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అరటిపండును స్మూత్ గా పేస్ట్ చేసి, చేతులకు అప్లై చేయాలి. దీన్ని పూర్తిగా డ్రైగా మారే వరకూ ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పైనాపిల్ ప్యాక్ : పైనాపిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. పైనాపిల్ ను మెత్తగా పేస్ట్ చేసి, చేతులకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీంటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం, పంచదార మరియు పాలు : నిమ్మరసం, పంచదార మరియు పాలు మూడు మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. 10 నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ముడుతలు మాయం అవుతాయి.

వాటర్ మెలోన్ : వాటర్ మెలోన్ ను స్లైస్ గా కట్ చేసి చర్మానికి అప్లై చేసి మర్ధన చేయాలి. ఇది నేచురల్ గానే ముడుతలను నివారిస్తుంది. 5 నుండి 10 నిముషాలు అప్లై చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ముడుతలు తొలగిపోయి, చర్మానికి తగిన హైడ్రేషన్ అందుతుంది. మంచి ఫలితాలను పొందడానికి దీన్ని వారంలో రెండు సార్లు వేసుకోవాలి.
రైస్ మాస్క్: రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ఒక టీస్పూన్ పాలు మిక్స్ చేసి, చేతులకు అప్లై చేయాలి. ఇది నేచురల్ గా డ్రై గా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

*

*

Top