గౌతమీపుత్ర శాతకర్ణి గ్యాలరీ

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాగానే కాక, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం “గౌతమిపుత్ర శాతకర్ణి”. “శాతకర్ణి”గా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహార్యం తెలుగువారిని అమితంగా ఆకట్టుకోగా, “గౌతమిపుత్ర శాతకర్ణి” టీజర్, ట్రైలర్ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇక చిరంతన్ భట్ స్వరపరిచిన బాణీలతే సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తూ.. సినిమా ఎప్పుడు విడుదలవుతుండా అని ఆశగా ఎదురుచూసేలా చేసింది.

ప్రేక్షకుల, నందమూరి అభిమానుల ఎదురుచూపులకు సమాధానంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు “గౌతమిపుత్ర శాతకర్ణి” విడుదల తేదీని నేడు నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. సినిమా ప్రారంభోత్సవం నాడే “సంక్రాంతి సినిమా” అని సినిమా యూనిట్ సభ్యులందరూ సగర్వంగా ప్రకటించిన ఈ చిత్రం అన్నమాట ప్రకారం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.

*

*

Top