అమెజాన్ సొంత ఫోన్ కేవలం రూ.6,000కే అందించబోతుంది..

అమెజాన్-సొంత-ఫోన్-కేవలం-ర

ఈ-కామర్స్ దిగ్గజం Amazon నుంచి ‘Ice’ బ్రాండ్ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి. గతంలో Fire బ్రాండ్ పేరిట స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసి చేతులు కాల్చుకున్న అమెజాన్, ఆ బ్రాండ్‌ను 2015లో అర్థంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లకు విస్తృతమైన డిమాండ్ నెలకున్నందున తన అదృష్టాన్ని Ice లైనప్‌తో పరీక్షించుకునేందుకు అమెజాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గతంలో అమెజాన్ లాంచ్ చేసిన ఫైర్ బ్రాండ్ ఫోన్ యూఎస్ ఇంకా ఇతర పాశ్చాత్య మార్కెట్లకు మాత్రమే పరిమితమయ్యింది. తాజా ఐస్ బ్రాండ్ నుంచి అమెజాన్ తీసుకురాబోతోన్న ఫోన్‌లు ఇండియాలో కూడా దొరుకుతాయని సమాచారం.అమెజాన్ నుంచి లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్ లేటెస్ట్ వర్షన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. గూగుల్ మొబైల్ సర్వీసెస్, జీమెయిల్, గూగుల్ ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండబోతున్నాయి. అమెజాన్ భారత్‌లో లాంచ్ చేయబోయే ఫోన్ స్పెసి‌ఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు…

8జీబి ర్యామ్‌తో మొదటి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది

అమెజాన్ అభివృద్ధి చేస్తోన్న ఐస్ స్మార్ట్‌ఫోన్ 5.2 నుంచి 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం. డివైస్ ఇతర స్పెసిఫికేషన్స్‌ను పరిశీలించినట్లయితే.. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 435 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్. మార్కెట్లో అమెజాన్ లాంచ్ చేయబోతోన్న ఫోన్ ధర $97 (రూ.6,000గా) ఉండొచ్చని అంచనా.

*

*

Top