అందానికి పెసరపిండి దివ్య ఔషధం అని మీకు తెలుసా..!

అందానికి పెసరపిండి దివ్య ఔషధం అని మీకు తెలుసా..!

అందానికి పెసరపిండి దివ్య  ఔషధం అని మీకు తెలుసా: పెసరపిండి సౌందర్యాన్ని పెంచుతుందన్న విషయం మీకు తెలుసా? సబ్బు ఎంత హెర్బల్ సోప్ ఐన సరే దానిలో కొంతవరకు చాలా గరుకుగా ఉండే పదార్ధం ఉంటుంది. అది చర్మాన్ని ముదురుగా చెయ్యడమే కాకుండా నల్లగా కూడా అవుతాము. అలాగా అని సబ్బు వాడకపోతే స్నానం చేసినట్టు ముఖం కడుకునట్టు ఉండదు అందుకే సోప్ లేదా సబ్బు వాడకం తగ్గించి ఇప్పుడు చెప్పబోయాది రెండు సార్లు వాడితే నలుపుతనం పోయి మచ్చలు బ్లాకు హెడ్స్ పూర్తిగా పోయి మంచి గ్లో అండ్ సాఫ్ట్ గా అవుతుంది.

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు…సౌందర్యపోషణ పట్ల కాస్త శ్రద్ధ పెట్టగలిగితే మరింతగా మెరిసిపోవడం సాధ్యమవుతుంది. మరి దానికోసం అందుబాటులో ఉండే పెసరపిండి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అదెలాగంటారా..

పెసరపిండి మాస్క్ : కొద్దిగా పెసరపిండి(బయట మార్కెట్లో దొరికేవి వాడవచ్చు) తీసుకుని దానిలో చిటికెడు పసుపు వేసి కొద్దిగా చల్లని పాలు వేసి కలుపుకోవాలి అంటే ఒక పేస్టులాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖానికి ఆలివ్ నునే లేదా నువ్వుల నునే పట్టించి రెండు నిమిషాలు మర్దన చేసి పైన కలిపి పెట్టుకున్న పేస్టు రాసుకుని ఒక పావు గంట ఉంచుకుని ఆరాక కడగాలి అది కూడా కొద్దిగా చల్లని నీటితో ఇలాగా రోజుకి రెండు సార్లు లేదా ఒకసారి మీ సమస్య త్రివ్రతని బట్టి వాడుకోవచ్చు.

జిడ్డు చర్మానికి : కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. దానికి తోడు దుమ్ము, ధూళి వంటివి పేరుకుని ముఖం నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా మొటిమల వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు పరిష్కారంగా మూడు చెంచాల పెసరపిండికి రెండు చెంచాల పెరుగు, చెంచా కీరదోస రసం, రెండు చుక్కల లావెండర్‌నూనె కలిపి ముఖానికి పూతలా రాయాలి. ఇలా చేస్తే చర్మం కాంతిమంతంగా మారుతుంది. మురికీ తొలగిపోతుంది.

నల్లగా మారిన చర్మం తెల్లగా మారుతుంది: మూడు చెంచాల పెసరపిండిలో మూడు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ గుజ్జు, చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న నలుపుదనం పోయి తాజాగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తుంటే ఛాయా మెరుగుపడుతుంది.

మృతకణాలు తొలగిస్తుంది: కొందరి చర్మంపై మృతకణాలు పేరుకోవడం వల్ల గరుకుగా ఉంటుంది. ఇలాంటప్పుడు పావుకప్పు పెసరపిండి, అర చెంచా బియ్యప్పిండి, కొంచెం పసుపుని గులాబీ నీటితో కలిపి మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని నాలుగు నిమిషాలు ఉండనివ్వాలి. ఆపై పాలతో చేతిని తడుపుకుంటూ నలుగులా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

కాళ్ళు చేతులు తెల్లగా మార్చుతుంది: కొందరికి మెడ, మోచేతులూ, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారుతుంది. ఇలాంటప్పుడు పావుకప్పు పెసరపిండికి, చెంచా నిమ్మరసం, గులాబీనీరు చేర్చి మెత్తగా చేసుకుని ఆ ప్రదేశాల్లో పూతలా వేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి.

జుట్టు నిగనిగలాడుతుంది: గుడ్డులోని తెల్లసొనలో ఒక టీ స్పూన్ పెసరపిండి, టీ స్పూన్ నిమ్మరసం, కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసుకోవాలి. దాన్ని తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

మొటిమలను మచ్చలను తొలగిస్తుంది: రెండు టీ స్పూన్ల పెసరపిండి, రెండు టీ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై పూతలా వేసి, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలూ, మొటిమల తాలూకు మచ్చల్ని తొలగిస్తుంది.

*

*

Top